<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>223</hymn_number>
<title>బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు</title>
<lyrics>[C1]
   బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
   శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
   సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
   హల్లెలూయా........హల్లెలూయా (2)
   హల్లెలూయా........హల్లెలూయా హోసన్న
   హల్లెలూయా........హల్లెలూయా

[V1]
 ఎల్‌ ఓలామ్‌ (2)
 అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
 నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
 నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
 హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా

[V2]
 ఎల్‌ షద్దాయ్‌ (2)
 పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
 రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా
 నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) // హల్లెలూయా //

[V3]
 అడోనాయ్‌ (2)
 ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
 సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు
 నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) // హల్లెలూయా //</lyrics>
</song>